Team India C Team To Sri Lanka ఒకరు లేకపోతే మరొకరు | Kamran Akmal | IND VS SL || Oneindia Telugu

2021-05-30 1

IND VS SL 2021: Former Pakistan wicket-keeper Kamran Akmal reckons Indian cricket is so well equipped that they can field three international teams at the same time and each of them will be tough to beat.
#INDVSSL
#KamranAkmal
#SanjuSamson
#INDVSENG
#IndiaTourOfSrilanka
#RishabPant
#threeinternationalteams
#TeamIndiaCTeam

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై పాకిస్థాన్ మాజీ వికెట్‌కీపర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసల జల్లు కురిపించాడు. యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో బీసీసీఐని ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకోవాలన్నాడు. ఏక కాలంలో మూడు జట్లను బరిలోకి దించే సత్తా భారత్ క్రికెట్ సొంతమని అక్మల్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం భారత్ క్రికెట్ చాలా పటిష్ఠంగా ఉందని తెలిపాడు. దీనికి ఆ దేశ క్రికెట్ బోర్డు అవలంబిస్తున్న విధానాలే కారణమని తెలిపాడు. దేశవాళీ క్రికెట్, భారత్-ఏ పర్యటనలతో పాటు ఐపీఎల్ మేటీ ఆటగాళ్లను అందిస్తుందన్నాడు. శ్రీలంక పర్యటనకు భారత్ రెండో జట్టు వెళ్లనున్న నేపథ్యంలో అక్మల్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక పర్యటనకు భారత్ సీ టీమ్ వెళ్లినా సునాయసంగా గెలుస్తుందన్నాడు..